భక్తి: మౌన వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా…?

-

చాలా మంది పూజలు మాత్రమే కాకుండా మౌన వ్రతం వంటివి చేస్తూ ఉంటారు. అసలు మౌనవ్రతం ఎందుకు చేయాలి..?, దీని వల్ల కలిగే లాభం ఏమిటి…? ఇలా అనేక విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మౌనము అంటే మునివృత్తి. మునులు ఈ విధానాన్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే మనకు పంచజ్ఞానేంద్రియాలు ఉంటాయి. అవే కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, శరీరం.

maunaratam benefits
 

అయితే వీటన్నిటికీ మౌనం ఇవ్వడమే మౌనవ్రతం అంటే. శరీరాన్ని ఎవరూ తాకకుండా, కళ్లతో ఏది చూడకుండా, చెవులు వేటిని వినకుండా, నాలుక ఏమీ మాట్లాడకుండా, ముక్కుతో ఉచ్వాస నిశ్వాస క్రమాలు క్రమబద్ధీకరణ ఉండగలిగితే శరీరం లోని మిగతా ఇంద్రియాలు అన్నీ కలిపి కూడా పూర్తిగా మౌనం పాటించడమే మౌనవ్రతం అంటే.

ఇలా మౌనం పాటించే పద్దతిని మౌనవ్రతం అంటారు. అందుకే మౌనం వ్రతం వుండే వాళ్ళు కేవలం ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఇలా చాలా నిష్ఠగా మౌన వ్రతాన్ని చేస్తారు. అయితే మౌన వ్రతం చేయడం వల్ల శరీరానికి కాసేపు అయినా విశ్రాంతి దొరుకుతుంది అని అంటారు.

దీని కారణంగా శరీరానికి హీలింగ్ పవర్ వస్తుంది. అలానే మరింత ఉత్సాహం వస్తుంది. శరీరం కూడా బాగా పని చేస్తుంది. సాధారణంగా మనం ఇళ్లలో ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఒక వేళ మౌన వ్రతం చేసాము అంటే శరీరం బాగా పని చేస్తుంది. ఇలా ఈ పద్దతి వెనుక ఇంత అర్థం ఉంది అని పండితులు చెప్తున్నారు. అంతే కానీ మనల్ని మనం బాధ పెట్టుకుని మాట్లాడకుండా కూర్చోవడం కాదు.

Read more RELATED
Recommended to you

Latest news