దత్తక్షేత్రములను దర్శించుకుందాం!

-

దత్తాత్రెయుడు బాధలను తొలగించి, కోరిన కోర్కెలు తీర్చేవాడు. మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న దత్తక్షేత్రములను ఎక్కడ ఏ నామస్మరణంతో ఆయన్ని పిలుస్తారో చూద్దాం.


1. శ్రీపాద శ్రీ వల్లభస్వామి– పిఠాపురం
ఇది దత్తుని ప్రథమ అవతారం అంటారు. శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన ప్రదేశం ఇది. ఇది మన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉంది.
2. కురువపురం
దత్తావతారులైన శ్రీపాదవల్లభులు తపస్సు చేసిన ప్రదేశం ఇది. హైదరాబాద్‌–కర్నూల్‌ మార్గంలో వెళ్లవచ్చు.
3. గోకర్ణం
దత్తావతారులైన శ్రీపాద వల్లభుడు తపస్సు చేసిన స్థలం. కర్ణాటక హుబ్లి ద్వారా వెళ్లవచ్చు.
4. కరంజా
రెండో దత్తావతారం. నృసింహ సరస్వతి (శ్రీ గురుడు) జన్మస్థలం. ఇది మహరాష్ట్ర అమరావతిలో ఉంది.
5. నర్సోబావాడిన
శ్రీ గురుడు 12 సంవత్సరంలో తపస్సు చేసిన స్థలం. కొల్హాపూర్‌ మీరజ్‌ రూట్‌లో ఉంది.
6. గాణగాపూర్‌
శ్రీ గురుడు 23 సంవత్సరాల నివసించిన స్థలం. కర్నాటక గుల్బర్గ వద్ద కలదు. ఇక్కడ శ్రీగురుని నిజపాదుకలు ఉంటాయి. చూడవలసిన స్థలం. బీమా–అమరజా సంగమ స్నానం పరమ పవిత్రం.
7. ఔదుంబర్‌
శ్రీ గురుడు చాతుర్మాసం చేసిన స్థలం. ఇది మహారాష్ట్రలో ఉంది.
8. మీరజ్‌
శ్రీ గురుడు తపస్సు చేసిన స్థలం. కొల్హాపూర్‌ రూటులో జైసింగ్‌ పూర్‌ వద్ద నుంచి వెళ్లవచ్చు.
9. శ్రీశైలం
శ్రీ గురుడు అంతర్దానమైన ప్రదేశం. ఈ స్థల దర్శనం చాలా దుర్లభం అంటారు. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉంటేనే చేరుకోగలరు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.
10. మాణిక్య నగర్‌
మూడో దత్తావతారం శ్రీ మాణిక్య ప్రభువుల వారి సమాధి, ప్రభువుల వారి సంస్థానం, కర్నాటక గుల్బర్గా– హైదరాబాద్‌ రూటులో ఉంటుంది.
11. అక్కల్‌ కోట
నాలుగో దత్తావతారం. స్వామి సమర్థ (అక్కల్‌ కోటస్వామి) సమాధి మందిరం ఇది. చెన్నై– ముంబయి రూటులో అక్కల్‌ కోట స్టేషన్‌లో ఉంది.
12. షిర్డి
ఐదో అవతారం. సంపూర్ణ దత్త భగవాణుడి పూర్ణావతారం. సద్గురు షిర్డి సాయి మందిరం. మహారాష్ట్రలో ఉంది. అన్ని ప్రాంతాల నుంచి నాగర్‌సోల్, మన్మాడ్‌ సాయినగర్‌ స్టేషన్ల నుంచి మందిరానికి చేరుకోవచ్చు. ఇది అందరూ తప్పక చూడాల్సిన ప్రదేశం.
13. సాకోరి
ఏక ముఖ దత్తుని ఆలయం కలదు. ఇక్కడ సాయి సేవ చేసుకున్న ఉపాసిన బాబావారి సమాధి మందిరం దర్శించుకోవచ్చు. ఇది షిర్డికి దగ్గర్లో ఉంటుంది.
14. నాసిక్‌
ఏకముఖ దత్త విగ్రహం ఉంటుంది. ఇది కూడా షిర్డికి దగ్గర్లో ఉంది.
15. గిరినార్‌
ఇక్కడ దత్త పాదుకలు ఉంటాయి. ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉంది. చాలా మహిమ ఉన్న 10 వేల మెట్లు కలిగిన కొండపై ఉంది. ఈ దత్తున్ని దర్శిస్తే దత్త అనుగ్రహం తప్పక కలుగుతుందని భక్తుల నమ్మకం.
16. షేగాం
మరో దత్త రూపమైన గజానన మహారాజ్‌ సమాధి మందిరం ఉంటుంది. ఇది నాగపూర్‌ పట్టణంలో ఉంది.
17. ఖాండ్వా
శ్రీ దునవాలా దాదా వారి సమాధి మందిరం ఉంది. ఇది మధ్యప్రదేశ్‌లో ఉంది.
18. ఖేడ్గాప్‌
సమర్థ నారాయణ మహరాజు వారి సమాధి ఉంటుంది. పూనెలో ఉంది.
19. మాణ్‌గావ్‌
శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి జన్మస్థలం. గురుచరిత్రను అందించిన మహనీయుడు. ఇది మహారాష్ట్రలో ఉంది.
20. మౌంట్‌ అబు
దత్త శిఖరం ఉంటుంది. రాజస్తాన్‌లో ఉంటుంది.
21. గరుడేశ్వర్‌
వాసుదేవానంద సరస్వతి స్వామి వారి సమాధి మందిరం ఉంటుంది. ఇది గుజరాత్‌లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news