జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మీద ఆసక్తికర కామెంట్స్ చేశారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని టీడీపీ కార్యకర్తలే కాక నందమూరి కుటుంబ అభిమానులు సైతం భావిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి.
ఎన్నికలు వచ్చినప్పుడు అయితే ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ కీలకంగా మారాయి. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు అని ఎవరు మీలో కోటీశ్వరులు ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ ప్రశ్నించగా దానికి ఆయన ఆసక్తికరంగా స్పందించారు. పొలిటికల్ ఎంట్రీకి ఇది సమయం సందర్భం కాదని ఆయన పేర్కొన్నారు. ఇక ఇప్పటికి అయినా ఈ ప్రచారాలు ఆగుతాయేమో చూడాలి మరి.