అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఇక ఒకే పరీక్ష.. ఎప్పుడంటే?

-

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగార్థులకు అన్ని పోస్టులకు ఒకే పరీక్ష నిర్వహించాలని సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్ష నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాలు, పబ్లిక్‌ సెక్టర్‌ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సెట్‌)ను సెప్టెంబర్‌ లో నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు.

iit Jee 2019 exam postponed

దీని కోసం కేంద్ర మంత్రి వర్గం ఆమోదంతో నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ), ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌ ) రైల్వే రిక్రూట్మెంట్‌ బోర్డ్‌(ఆర్‌ఆర్‌బీ) తదితర ఉద్యోగ నియామకాలకు కామన్‌ ఎంట్రస్ట్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు మంత్రి తెలిపారు. నేషనల్‌ రిక్రూటింగ్‌ ఏజెన్సీ ఓ స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని చెప్పారు. సెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులు వివిధ ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరుకావచ్చని స్పష్టం చేశారు. దీనివల్ల విద్యార్థులందరికీ సమాన న్యాయం చేసినట్టవుతుంది. వారి సమయం వృథా కాదు.

సెట్‌ గురించి కీలక విషయాలు

  • గ్రాడ్యుయేట్, ఇంటర్ అభ్యర్థులకు వేర్వేరుగా సెట్‌ నిర్వహిస్తారు.
  • ఈ సెట్‌ స్కోర్‌ కార్డు మూడేళ్ల వరకు వర్తిస్తుంది.
  • అభ్యర్థుల వయోపరిమితి ఆధారంగా ఎన్ని సార్లు అయినా పరీక్షను రాసే వీలుంది.
  • జిల్లాకు ఓ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. రూరల్‌ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు, దివ్యాంగులు, మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.
  • వివిధ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులందరికీ సమానావకాశాలు కల్పించడానికే ఈ కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ ను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
    దీనివల్ల అభ్యర్థుల సమయం, డబ్బుల వృథా తగ్గుతుంది. అందరికీ అవకాశం కల్పించి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news