70వసంతాలు పూర్తి చేసుకున్న పాతాళ భైరవి..

-

ఏదైనా సమస్యకి పరిష్కారం వేరే దానిలో దొరికితే, మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు దీని పరిష్కారం వేరే దగ్గరుందని చెబుతుంటారు. ఎప్పుడో 70సంవత్సరాల క్రితం రిలీజైన ఒక సినిమాలో మాటని గుర్తుపెట్టుకుని ఇప్పటికీ మన మాటల్లో వాడుతున్నామంటే, ఆ సినిమా మన మీద ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. 1950ల్లో వచ్చిన చాలా సినిమాలు తెలుగు సినిమా గతినే మార్చి వేసాయి. మిస్సమ్మ, షావుకారు, మాయాబజార్, తెనాలి రామక్రిష్ణ, కన్యాశుల్కం, జయభేరి మొదలైనవన్నీ క్లాసిక్స్ గా మిగిలాయి. వీటన్నింటిలో పాతాళ భైరవి కూడా ఒకటి.

1951లో రిలీజ్ అయిన పాతాళ భైరవి, నేటికి 70ఏళ్ళు పూర్తి చేసుకుంది. కదిరి వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని బీ నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి నిర్మించారు. 200రోజులు థియేటర్లలో నడిచిన మొదటి చిత్రంగా ఈ సినిమా రికార్డుకెక్కింది. అంతే కాదు, దక్షిణ భారతదేశం నుండి అంతర్జాతీయ వేదికపై ప్రదర్శితమైన మొదటి చిత్రంగా ఘనత దక్కించుకుంది. 1952లో అంతర్జాతీయ వేదికపై పాతాళ భైరవి సినిమాని ప్రదర్శించారు.

నేపాల మాంత్రికుడిగా ఎస్వీ రంగారావు, తోటఅ రాముడిగా ఎన్టీరామారావు, ఇందుమతి గా కె మాలతి తమ అద్భుతమైన నటనతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళారు. భారత దేశ చలన చిత్రాల్లో వంద గొప్ప చిత్రాల జాబితాలో పాతాళ భైరవి కూడా ఉంది. జానపద కథగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. తెలుగు ప్రేక్షకులకి సరికొత్త అనుభవాన్ని అందించి, తెలుగు సినిమా స్థాయిని పెంచిన పాతాళ భైరవి సినిమా తెలుగు వాళ్ళందరికీ గర్వకారణమే.

Read more RELATED
Recommended to you

Latest news