ఏప్రిల్ నుండి కొత్త రూల్స్.. ఈ బ్యాంక్ ఖాతాదారులు గమనించండి..!

-

మీకు ఈ బ్యాంక్ లో ఖాతా వుందా…? అయితే ఈ విషయాలని మీరు గమనించండి. ఇటీవలి కాలంలో కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇతర బ్యాంకుల్లో విలీనం చేసిన సంగతి తెలిసినదే. దేనా బ్యాంక్‌, విజయా బ్యాంక్‌, కార్పోరేషన్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటైడ్‌ బ్యాంక్‌, అలహాబాద్ బ్యాంక్ కూడా వున్నాయి.

ఒకవేళ ఈ బ్యాంకుల్లో కనుక మీకు ఎకౌంట్ ఉంటే రూల్స్ మారుతున్నాయి గమనించండి. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభంకానున్న కొత్త ఆర్థిక సంవత్సరం కారణంగా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
‌ఈ బ్యాంక్స్ పాస్‌బుక్‌, చెక్ ‌బుక్‌లు ఏప్రిల్‌ 1నుంచి చెల్లుబాటు కావు. ఇప్పటికే బ్యాంక్స్ ఖాతాదారులకు సమాచారం అందించారు.

పాత బ్యాంకుల బ్యాంకింగ్ ఆధారాలు 2021 మార్చి 31 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉండడం కారణంగా పాస్​బుక్​, చెక్​బుక్​, ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్ మొదలైనవి 2021 ఏప్రిల్ 1 నుంచి వర్క్ చేయవు గమనించండి.

ఇది ఇలా ఉంటే ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్​బుక్​, చెక్​బుక్​ మొదలైనవి జూన్ 30 వరకు అమల్లో ఉంటాయని కెనరా బ్యాంక్ పేర్కొంది. అలానే సిండికేట్‌ బ్యాంకు అయితే పాస్​బుక్​ లావాదేవీలను జూన్​ 30 వరకు జరుపుకునేందుకు అవకాశం కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news