మంచి లాభం వచ్చే బిజినెస్ చెయ్యాలనుకుంటున్నారా…? అయితే ఇలా చెయ్యండి..!

మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చెయ్యాలనే ఆలోచనలో వున్నారా..? అయితే ఈ బిజినెస్ చెయ్యొచ్చు. దీని వలన మంచి ఆదాయం కూడా వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో మనకు పేపర్ ప్లేట్స్ బాగా అవసరం అవుతున్నాయి. అన్నింటిలోనూ మనం వాటిని ఎక్కువగా ఉపయోగిస్తాం. అయితే ఇంత ఎక్కువ ఉపయోగిచే ఈ పేపర్ ప్లేట్స్ బిజినెస్ ని కనుక స్టార్ట్ చేసారు అంటే నెల‌కు వేల‌ల్లో సంపాదించ‌వ‌చ్చు.

business
business

పైగా ఎప్పుడు కూడా మంచి బిజినెస్ నడుస్తుంది. ఈ బిజినెస్ ని ఇంట్లో ఉండే గృహిణులు కూడా చెయ్యచ్చు. నిరుద్యోగ యువత, స్వయం సహాయక బృందాలకు కూడా బెస్ట్ ఆప్షన్. దీని కోసం మీరు ఫ్యాక్టరీ లేదా యూనిట్ ని స్టార్ట్ చెయ్యాల్సి ఉంటుంది.

లేదా ఒక షాప్ లో అయినా స్టార్ట్ చెయ్యచ్చు. ఇక సంపాదించచ్చు అనే విషయానికి వస్తే…. ప్రస్తుతం మార్కెట్ లో అయితే ప్లేటు 20పైస‌ల ధ‌ర‌కు హోల్‌సేల్‌గా విక్ర‌యించవ‌చ్చు. ఒకవేళ 8వేల ప్లేట్ల‌కు అయితే రోజుకు రూ.1600 దాకా మీకు ఆదాయం లభించే అవకాశం ఉంది.

ఖ‌ర్చులు పోను రోజుకు రూ.800 నుంచి రూ.1400 వ‌ర‌కు మిగులుతుంది. ఇలా నెల‌కు రూ.24వేల నుంచి రూ.42వేల వ‌ర‌కు సంపాదించే వీలుంది. ఇక ఈ బిజినెస్ కి ఏం అవసరం అనే దానికి వస్తే… మొదట మిషన్ ని కొనుగోలు చెయ్యాలి. ఇవి మార్కెట్ ‌లో రూ.60 వేల నుండి స్టార్ట్ అవుతున్నాయి.

సింగిల్ హైడ్రాలిక్ పేప‌ర్ ప్లేట్ మెషిన్ ధ‌ర సుమారుగా రూ.60వేల వరకూ ఉంది. అదే డ‌బుల్ హైడ్రాలిక్ మెషిన్ అయితే రూ.1.20 ల‌క్ష‌ల దాకా ఉంది. అలానే గ్రీన్‌, సిల్వ‌ర్ త‌దిత‌ర రంగుల్లో ఉండే షీట్ల‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ త‌రువాత పేప‌ర్ ప్లేట్ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు.