శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెండు చోట్ల పోలింగ్ ను గ్రామస్థులు బహిష్కరించారు. మాజీ మంత్రి బొజ్జల స్వగ్రామం ఊరందూరు తో పాటు నారాయణ గ్రామస్థులు ఎన్నికల బహిష్కరణకు నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో తమ గ్రామాలను విలీనం ప్రతిపాదనలను గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. ఒక్క ఓటరూ రాక ఊరందూరు పోలింగ్ స్టేషన్ బోసిపోయింది.
తమ గ్రామాన్ని శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో కలపడం పై నిరసన వ్యక్తం చేస్తూ పోలింగ్ బహిష్కరించారు. ఇప్పటికీ ఒక్క ఓటు కూడా పోల్ అవ్వని పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని కలపమని రాతపూర్వక హామీ ఇవ్వాలని కోరుతున్నారు గ్రామస్థులు. గ్రామంలో 2 వేల పై చిలుకు ఓట్లు ఉన్నాయి. మున్సిపాలిటీలో కలిపే ప్రతిపాదనలపై గ్రామస్థులు ససేమిరా అంటున్నారు. ఒక్క మాట పై నిలిచిన అందరూ గ్రామస్థులు వోటింగ్ బహిష్కరించడం చర్చనీయాంశంగా మారింది.