తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టు విభజన జరిగిన నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ మంగళవారం తెలంగాణ హైకోర్టు తొలి చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఇతర న్యాయమూర్తులతో హైకోర్టు ఆవరణలో చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ హైకోర్టుకు 24 మంది న్యాయమూర్తులను కేటాయించగా…
అయితే ప్రస్తుతం 13 మంది మాత్రమే ఉన్నారు. ఇక, ఏపీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ సైతం మంగళవారం అమరావతిలో బాధ్యతలు చేపట్టనున్నారు. మరి కొద్ది గంటల్లో ఏపీలోను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.