సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న మహేష్, ప్రస్తుతం సినిమా చిత్రీకరణని ఆపేసాడు. కరోనా కారణంగా చిత్రీకరణకి బ్రేక్ పడడంతో ఇంటి పట్టునే ఉంటున్నాడు. దాంతో కొత్త కథలు వింటున్నాడని తెలుస్తుంది. రాజమౌళితో మహేష్ సినిమా మొదలవడానికి చాలా టైమ్ పడుతుంది. అదీగాక మధ్యలో త్రివిక్రమ్ సినిమా కూడా ఉంది. త్రివిక్రమ్ తో సినిమా పూర్తయ్యాక ఉండే గ్యాప్ లో మరో సినిమా తీయాలని అనుకుంటున్నాడని సమాచారం.
గురు, ఆకాశం నీ హద్దురా సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్న తెలుగు దర్శకురాలు సుధా కొంగరతో సినిమా ఉంటుందని వినిపిస్తుంది. సుధా కొంగరతో కథా చర్చలు జరుగుతున్నాయని, అన్నీ కుదిరితే త్రివిక్రమ్ తో సినిమా పూర్తయ్యాక ఇది మొదలవుతుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. ఆకాశం నీ హద్దురా సినిమా తర్వాత అజిత్ తో సినిమా మొదలెట్టింది సుధ కొంగర.