భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నది. దాంతో దేశంలో మెడికల్ ఆక్సిజన్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. బాధితుల సంఖ్యతో పాటు ఆక్సిజన్ కొరత కూడా పెరిగిపోతున్నది. ఈ క్రమంలో ఈ టెస్ట్ చేసుకుంటే అవసర వారికి మాత్రమే ఆక్సిజన్ అందిస్తే వృథాను అరికట్టే అవకాశం ఉన్నది.
కరోనా వైరస్ బారిన పడి హోమ్ క్వారెంటైన్లో ఉన్నవాళ్లు, కరోనా సోకిందేమోనన్న అనుమానం ఉన్నవాళ్లు కేవలం ఆరు నిమిషాల నడక ద్వారా తమలోని ఆక్సిజన్ సరిగా ఉందొ లేదో అని తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఈ పరీక్షను ఎలా నిర్వహించుకోవాలంటే అనుమానం ఉన్నవారు ముందుగా పల్స్ ఆక్సీమీటర్ ద్వారా తమలో ఆక్సిజన్ స్థాయిలను పరీక్షించుకోవాలి. ఆ తర్వాత ఆరు నిమిషాలపాటు గదిలో వాకింగ్ చేయాలి. ఆ తరువాత మరోసారి పల్స్ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవాలి. ఇలా ప్రతి రోజులో రెండు మూడు సార్లు పరీక్షించుకోవాలి. ఈ పరీక్షల్లో పల్స్ ఆక్సిమీటర్పై రీడింగ్ 94 అంతకంటే ఎక్కువగా నమోదవుతతుంటే ఆక్సిజన్ స్థాయిలు సాధారణంగా ఉన్నట్లని, రీడింగ్ 94 అంతకంటే తక్కువగా నమోదవుతున్నట్లయితే ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నట్టు అని వైద్యులు చెబుతున్నారు.