ఎయిర్ ఇండియా యొక్క సర్వర్ లో జరిగిన భారీ సైబర్ ఎటాక్ కారణంగా ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 45 లక్షల మంది ప్రజల వ్యక్తిగత డేటా దొంగతనం జరిగింది. లీకైన డేటా ఆగస్టు 26, 2011 మరియు ఫిబ్రవరి 3, 2021 మధ్యనే జరిగిందని ప్రకటించారు. పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, పాస్‌పోర్ట్ సమాచారం, టికెట్ వివరాలు, క్రెడిట్ కార్డ్ డేటా వంటి వ్యక్తుల వ్యక్తిగత వివరాలు ఇందులో ఉన్నాయి.
ఎయిర్ ఇండియా ప్యాసింజర్ సర్వీస్ సిస్టమ్ ప్రొవైడర్ సిటాపై “అధునాతన సైబర్‌టాక్” కారణంగా భారీ డేటా లీక్ జరిగింది అని ఎయిర్ ఇండియా తెలిపింది. పాస్వార్డ్ లు మార్చుకోవాలని మేము కోరుతున్నామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటన చేసింది. సిటా స్విట్జర్లాండ్‌లోని జెనీవాకు చెందిన సంస్థ. ఎయిర్ ఇండియా విదేశాలలో ఉన్న వివిధ రెగ్యులేటరీ ఏజెన్సీలతో సంబంధాలు కలిగి ఉంది కాబట్టి వాళ్లకు కూడా సమాచారం ఇచ్చామని తెలిపారు.