యూపీ ఐఏఎస్ అధికారి చంద్రకళ ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. మైనింగ్ స్కాంలో కీలకంగా వ్యవహరించినట్లు ఐఏఎస్ అధికారి చంద్రకళపై ఆరోపణలున్న నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె బంధువులు, స్నేహితులతో పాటు ఏక కాలంలో 12చోట్ల ఉదయం నుంచి ఏక కాలంలో దాడులు కొనసాగిస్తున్నారు.. ఆమెపై ఇసుక మాఫియాలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసింది. రాజకీయ నాయకులు చేసిన స్కాం లతో ఐఏఎస్ అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదంటూ పలువురు ఆరోపిస్తున్నారు.