తెలంగాణ శాసన సభ త్వరలో సమావేశం కానున్న నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ గా మజ్లీస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ నియమితులయ్యారు. అధికారులు, పార్టీ నేతలతో చర్చించిన అనంతరం ప్రొటెం స్పీకర్ నియామకంపై తెరాస అధినేత నిర్ణయం తీసుకున్నారు. 1994 నుంచి వరుసగా ఐదుసార్లు యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి విజయం సాధించగా..తాజాగా పార్టీ ఆదేశాల మేరకు ఈ సారి చార్మినార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శాసనసభ ఎన్నికల్లో చార్మినార్ నియోజకవర్గం నుంచి అహ్మద్‌ఖాన్ 32,586 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.
మజ్లీస్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయడం పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హర్షం వ్యక్తం చేస్తూ… సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 17 నుంచి 20 వరకు తొలి సారి శాసన సభ్యులు సమావేశం కానున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై శాసనసభ కార్యదర్శి, అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు.