HBD SURYA : ”జై భీమ్‌ ” అంటున్న హీరో సూర్య

-

తమిళ నాట స్టార్ స్టేటస్ ఉన్న హీరో సూర్యకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే… ఇవాళ హీరో సూర్య పుట్టిన రోజు కావడంతో అటు తమిళ ప్రేక్షకులతో పాటు ఇటు ప్రేక్షకుల్లో పండగ వాతావరణం నెలకొంది. అయితే… ఈ నేపథ్యంలోనే తన బర్త్‌ డే గిఫ్ట్‌ ఇచ్చేశాడు హీరో సూర్య. తన కెరీర్‌లో 39 వ సినిమా ”జై భీమ్‌” టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సూర్య స్వయంగా రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో సూర్య ఓ పవర్‌ ఫుల్‌ లాయర్‌ క్యారెక్టర్‌ లో కనిపించనున్నారని ఇవాళ రిలీజ్‌ అయిన పోస్టర్‌ చూస్తే.. తెలుస్తోంది. ఈ సినిమా లో రజిషా విజయ్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇక ఈ మూవీలో విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘నవరస’ ఆంధాలజీతో పాటు సూర్య ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్ తో ‘వాడి వాసల్’ మూవీని, పాండిరాజ్ దర్శకత్వంలో ‘ఎదర్కుం తనిందవన్’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగ… త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రక్రియను ప్రారంభించుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news