థియేటర్ల టిక్కెట్ల ధరలపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం

-

తెలంగాణలో సినిమా థియేటర్లలో టిక్కెట్లు ధరలపై ఇవాళ టీఎస్ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేశారని తెలంగాణ సర్కార్ ను ఈ సందర్భంగా ప్రశ్నించింది హైకోర్టు. టికెట్ల ధరలు నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.

ఆ కమిటీ సూచనలు తెలంగాణ ప్రభుత్వానికి నివేదించినట్లు కోర్టుకు ప్రభుత్వ తరుపు న్యాయవాది స్పష్టం చేశారు. అయితే దీనిపై స్పందించిన తెలంగాణ హైకోర్టు.. కమిటీ నివేదిక పై నాలుగు వారాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. ఇచ్చిన గడువులోగా ప్రభుత్వ నిర్ణయాన్ని కచ్చితంగా చెప్పాల్సిందేనని నొక్కి చెప్పింది తెలంగాణ హైకోర్టు. అలాగే.. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ , హోం శాఖ సెక్రెటరీ లకు హై కోర్టు ఆదేశాలు చేసింది. కాగా కరోనా నేపథ్యంలో థియేటర్లు మూత  పడిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news