ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం కు ముహూర్తం ఖరారు అయింది. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం అమరావతిలో జరగనుంది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం రేపు ఉదయం 11 గంటల సమయంలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పైన చర్చ జరగనుంది.
అలాగే తల్లికి వందనం రైతు భరోసా హామీల అమలుపై కూడా చర్చించనున్నారు చంద్రబాబు నాయుడు కేబినెట్ సభ్యులు. పలు కంపెనీలకు సంబంధించిన భూముల కేటాయింపు పైన కూడా… చంద్రబాబు కెమినేట్ నిర్ణయం తీసుకుంటుంది. కీలక బిల్లులపై ఆమోదం ముద్ర కూడా వేయనుంది. అయితే ఈసారైనా ఉచిత బస్సు ప్రారంభం అవుతుందా లేదా అనేది చూడాలి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆర్టీసీ బస్సు పై నాన్చుడి ధోరణితో ముందుకు వెళుతుంది కూటమి సర్కార్.