అమరావతి: ఏపీ సీఎం Jaganకు నిరసన సెగ తగిలింది. మూడు రాజధానులను నిరసిస్తూ అమరావతి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సెక్రటేరియట్‌కు వెళ్తున్న సీఎంకు ప్లకార్డులు చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అయితే రైతుల నిరసనకు పోలీసులు అడ్డుగా నిల్చున్నారు. అయినా రైతులు ఆగలేదు. జగన్‌కు వ్యతిరేకంగా పెద్దగా పెద్దగా నినాదాలు చేశారు. మూడు రాజధానులపై Jagan పునరాలోచించాలని డిమాండ్ చేశారు. దీంతో రైతుల శిబిరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీఎం జగన్ కాన్వాయ్ వెళ్లిపోవడంతో రైతులు వెనక్కి తగ్గారు.
కాగా మూడు రాజధానులను నిరసిస్తూ అమరావతి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. సీెం జగన్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి నిర్విరామంగా ఆందోళనను కొనసాగిస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా ఈ ఉద్యమాన్ని సాగిస్తున్నారు. అయినా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. ఏపీకి మూడు రాజధానులు తప్పనిసరి అని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొంటోం