తూగో జిల్లాలో అమీర్ ఖాన్ సందడి… !

-

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తూర్పుగోదావరి జిల్లా లో సందడి చేస్తున్నారు. అమీర్ ఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం అమీర్ ఖాన్ ఏపీకి వచ్చారు. ఈరోజు కోనసీమలోని అల్లవరం ఓడలరేవు ప్రాంతాల్లో జరగబోయే సినిమా షూటింగ్ లో అమీర్ ఖాన్ పాల్గొంటారు. అమీర్ ఖాన్ షూటింగ్ కోసం వచ్చి కాకినాడ సరోవర్ పోర్టికో హోటల్ లో బస చేసారు. అమీర్ ఖాన్ ప్రైవేట్ సెక్యూరిటీ ఆధీనంలో హోటల్ లో బస చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా లాల్ సింగ్ చెద్ద లో నాగచైతన్య కూడా నటిస్తున్నారు.

Ameerkhan lal singh Chaddha shooting at andhrapradesh
Ameerkhan lal singh Chaddha shooting at andhrapradesh

ఆర్మీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంతకాలం ఈ సినిమా షూటింగ్ జమ్మూకాశ్మీర్ లడక్ లో తీశారు. కాగా ఇటీవలే నాగచైతన్య షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చారు. ఈ సినిమాలో కరీనా కపూర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం గోదావరి జిల్లాలో బాలీవుడ్ సినిమా షూటింగ్ జరగడంతో స్థానిక ప్రజలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. షూటింగ్ ను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news