ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ఓ కాంటెస్ట్ ని మొదలు పెట్టనుంది. దీనిలో కనుక గెలిస్తే రూ.1,00,000 సొంతం చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే… CoRover అనే సంస్థ తో ఒప్పందం కుదుర్చుకుంది IRCTC.
ఈ రెండు సంస్థలు కలిసి వ్లాగింగ్ కాంటెస్ట్ ప్రారంభించాయి. విజేతలకు రూ.1,00,00 ప్రైజ్ మనీ ఇవ్వనున్నాయి. ట్విట్టర్‌లో ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన వివరాలను ఇచ్చారు. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనడానికి 2021 ఆగస్ట్ 31 చివరి తేదీ.
అయితే ఈ కాంటెస్ట్ లో ఏం చెయ్యాలి అనేది చూస్తే… దీనిలో వీడియోలు క్రియేట్ చెయ్యాల్సి ఉంటుంది. అది కూడా భారతదేశంలో ఏదైనా పర్యాటక ప్రాంతం గురించి లేదా భారతీయ రైళ్ల గురించి లేదా భారతీయ రైల్వే గురించి లేదా ఐఆర్‌సీటీసీ అందించే టికెటింగ్, టూరిజం లాంటి సేవల గురించి వివరించాలి. ఇలా వీడియోని చేయాల్సి ఉంటుంది. ఒకరు ఎన్ని వీడియోలైనా రూపొందించొచ్చు. వీడియోలో లైవ్ షూటింగ్ లేదా ఇన్ఫోగ్రాఫిక్స్ ఉండాలి. రెండూ కలిపి వీడియో రూపొందించొచ్చు. ఈ కాంటెస్ట్‌లో గెలిచినవారికి రూ.1,00,000 రివార్డ్ లభిస్తుంది.
దీంతో పాటు సర్టిఫికెట్, ట్రోఫీ కూడా లభిస్తుంది. అలానే రన్నరప్‌కు రూ.50,000, సర్టిఫికెట్, ట్రోఫీ, సెకండ్ రన్నరప్‌కు రూ.25,000 సర్టిఫికెట్, ట్రోఫీ ఇస్తారు. వీడియో క్వాలిటీ, కంటెంట్‌ను పరిగణలోకి తీసుకొని 300 మంది విజేతల్ని ప్రకటిస్తుంది ఐఆర్‌సీటీసీ. మొదటి ముగ్గురికి తప్ప మిగతావారికి గిఫ్ట్ కార్డ్స్, రూ.500, సర్టిఫికెట్స్ ఇస్తామని తెలిపింది. ఈ పోటీలో పాల్గొనేవారు https://corover.ai/vlog/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలానే వీడియో సబ్మిట్ చెయ్యాలి.