స్టార్ మా నిర్వహిస్తున్న బిగ్ బాస్ రెండు సీజన్లు పూర్తి చేసుకోగా.. 3వ సీజన్ కు సిద్ధమవుతుంది. ఈ సీజన్ హోస్ట్ గా ఎవరు చేస్తారు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మొదటి సీజన్ చేసిన ఎన్.టి.ఆర్ 3వ సీజన్ చేస్తాడని కొందరు అంటున్నారు. అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న ఎన్.టి.ఆర్ ను రాజమౌళి అంత ఈజీగా వదులుతాడంటే నమ్మలేం. ఎన్.టి.ఆర్ తో పాటుగా వెంకటేష్, చిరంజీవి. నాగార్జున ఇలా అందరిని బిగ్ బాస్ హోస్ట్ గా చేయాల్సిందిగా అడుగుతున్నారట.
ఇదిలాఉంటే కొందరు మాత్రం తారక్ ఈ సీజన్ హోస్ట్ గా చేయడం కన్ఫాం అని అంటున్నారు. అంతేకాదు ఎన్.టి.ఆర్ ను ఒప్పించేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ఏకంగా 20 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. ఎన్.టి.ఆర్ రేంజ్ కు ఆ పారితోషికం తప్పులేదు. కాని బుల్లితెర మీద ఈ రేంజ్ రెమ్యునరేషన్ అంటే అది ఒక్క ఎన్.టి.ఆర్ వల్లే అవుతుంది. సౌత్ లో టివి షోలో సరికొత్త్ రికార్డ్ కొడుతున్నాడు ఎన్.టి.ఆర్.
మరి 20 కోట్లు ఇస్తానన్నా ఎన్.టి.ఆర్ కాదన్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టంట్స్ లిస్ట్ కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ సీజన్ బిగ్ బాస్ ఇంకెంత హంగామా చేస్తుందో చూడాలి.