తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..నేటి నుండి డ్రోన్ల తో మందులు..!

-

తెలంగాణ లో ఇంటింటికీ డ్రోన్ ల ద్వారా కరోనా మందులు మరియు టీకాలు సరఫరా చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దానిని ప్రారంభిస్తున్నట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో ఇంటింటికీ కరోనా మందులు, టీకాలను డ్రోన్ ల ద్వారా పంపిణీ చేస్తామని అన్నారు. తొలిదశలో ట్రయల్స్ కింద ఈరోజు నుండి ఈనెల 17వ తేదీ వరకు వికారాబాద్ లో డ్రోన్ ల ద్వారా కరోనా మందులు, వ్యాక్సిన్ లను సరఫరా చేస్తున్నట్టు ప్రకటించారు.

స్కై ఎయిర్ మొబిలిటీ సాయం తో ఈ కార్యక్రమం చేపట్టినట్లు కెటిఆర్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ నెల 11వ తేదీ నుండి 9-10 కిలో మీటర్ల దూరంలో లక్ష్యాలకు సేవలు అందిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రం లో కరోనా కట్టడి కి డ్రోన్ ల ద్వారా మందులు, వ్యాక్సిన్ ల పంపిణీ ఎంతో ఉపయోగపడనుంది. ఈ విధానం ద్వారా వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశం ఉంది. అంతే కాకుండా ఆశా వర్కర్లకు సైతం ఇబ్బందులు తప్పనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news