చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరనున్నాడా? అసలు ఏపీలో ఏం జరుగుతోంది. రెండుమూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 2014లో స్వతంత్రంగా గెలిచిన ఆమంచి.. ప్రస్తుతం టీడీపీతో ఉన్నాడు. కానీ.. త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఆమంచి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే.. ఆమంచి వైసీపీకి జంప్ కొట్టనున్నట్టు తెలుసుకున్న చంద్రబాబు.. మంత్రి శిద్ధా రాఘవరావును రంగంలోకి దించాడు. ఏకంగా మంత్రి శిద్ధా బుజ్జగింపులకు దిగినప్పటికీ.. ఆమంచి ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి నారా లోకేశ్ రంగంలోకి దిగాడట. ఆమంచికి ఫోన్ చేసిన నారా లోకేశ్.. చంద్రబాబును ఇవాళ కలవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ ఆమంచి.. చంద్రబాబును మీట్ అవనున్నాడట. చంద్రబాబుతో భేటీ తర్వాత ఆమంచి వైసీపీ తీర్థం పుచ్చుకోవాలా? లేదా? అనేది డిసైడ్ అవనున్నట్లు సమాచారం.
అయితే… నారా లోకేశ్ ఫోన్ చేసినప్పటికీ.. చంద్రబాబుతో భేటీ అయినా కూడా ఆయన ఈనెల 13న వైఎస్సాఆర్ చేరనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి తనకు ఆహ్వానం అందిందని… టీడీపీలో తనకు సరైన గుర్తింపు లేదని తన అనుచరులతో ఆమంచి వెల్లడించినట్లు సమాచారం.