ఆడవాళ్ల డ్రెస్ లపై నాగబాబు కామెంట్.. అనసూయ షాకింగ్ రియాక్షన్!

-

మహిళలు, ఆడవాళ్లు వారికేం డ్రెస్ నచ్చితే అది వేసుకునే హక్కు ఉందని.. ఆడవాళ్ల డ్రెస్సుల మీద అభిప్రాయం చెప్పడం ఓకే కాని వాళ్లు అలా వేసుకోకూడదు.. ఇలా వేసుకోకూడదు అని చెప్పడానికి మీరెవరు అంటున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. తను పెట్టిన మై ఛానెల్, నా ఇష్టం యూట్యూబ్ ఛానెల్ లో ఈమధ్య ఆడవాళ్లు.. ముఖ్యంగా హీరోయిన్స్ వేసుకున్న కాస్టూమ్స్ మీద బాల సుబ్రహ్మణ్యం కామెంట్ పై తన రియాక్షన్ చూపించాడు నాగబాబు.

వాటికి కౌంటర్ ఇస్తూ నాగబాబు అసలు ఆడవాళ్ల డ్రెస్సుల గురించి మాట్లాడే హక్కు మీకేంటని.. వారు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలన్నది వారిష్టమని.. అయినా హీరోయిన్స్ షార్ట్ డ్రెస్సులు వేసుకున్నా కేవలం దాన్ని మాత్రమే మీరు ఎందుకు చూస్తారని.. ఇలాంటి కామెంట్స్ చేయొద్దని హెచ్చరించాడు నాగబాబు. నాగబాబు కామెంట్స్ బాలుతో పాటుగా పార్లమెంట్ లో రాజకీయ నాయకుడికి డైరెక్ట్ గా తగులుతాయి. అయితే ఈ కామెంట్స్ పై అనసూయ, రష్మిలు రియాక్షన్ అదిరిపోయింది.

ప్రస్తుతం నాగబాబు టైం నడుస్తుంది.. రెస్పెక్ట్ సర్ అంటూ అనసూయ కామెంట్ పెట్టగా.. కేవలం వేసుకునే దుస్తులను బట్టి మగవాళ్లనైనా, ఆడవాళ్లనైనా జడ్జ్ చేయకూడదని.. పుస్తకం కవర్ పేజి చూసి అంచనా వేయడం ఎంత తప్పో వారు వేసుకున్న డ్రెస్సులను బట్టి వారిని అంచనా వేయడం అంతే తప్పని అన్నది రష్మి. ఇక తమ లాంటి వారికి మద్ధతుగా నిలిచిన నాగబాబుకి రష్మి కృతజ్ఞతలు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news