Anchor Suma: బుల్లి తెర యాంకర్ సుమ కనకాల.. ఆమె పేరు తెలియని బుల్లి తెర ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె ఏ షో చేసినా.. ఏ ఈవెంట్ చేసినా .. ఫుల్ ఎనర్జీతో సక్సెస్ చేయడంలో సుమది అందె వేసిన చేయి. సుమ భర్త రాజీవ్ కనకాల మంచి నటుడు. విలన్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ ల్లో నటించి మెప్పిస్తున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఆయనకు తగ్గ ఓ పాత్ర పడలేదు.
కానీ లవ్ స్టోరీ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. తన సత్తా చూపించారు. ఈ పాత్రకి మరింత గుర్తింపు వచ్చింది. అయితే.. తాజాగా సుమ కూడా లవ్ స్టోరీ సినిమాను వీక్షించినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా తన భర్త రాజీవ్ పై ప్రశంశలు కురిపించింది.
‘తమ నటనతో మనల్ని లీనం చేసుకోగల నటులు కొంత మందే ఉంటారు. నా హబ్బీ రాజీవ్ కూడా అలాంటి వారిలో ఒక్కరూ. అద్బుతమైన రోల్ పోషించినందుకు కంగ్రాట్స్. ఆ పాత్ర చేసినందుకు నువ్వెంత చెడుగా ఫీల్ అయ్యావో నాకు తెలుసు.. కానీ ఆ పాత్రతో ఎంతో మంది మీద ప్రభావాన్ని చూపించావ్ అని అన్నారు.
అలాగే లవ్ స్టోరీ చిత్ర యూనిట్ గురించి మాట్లాడుతూ.. సున్నితమైన అంశాలను, మరింత సున్నితంగా చూపించిన శేఖర్ కమ్ములకు థ్యాంక్స్. నాగ చైతన్యకు హార్టీ కంగ్రాట్స్. సాయి పల్లవి డ్యాన్స్ చూసి నా కళ్లు నొప్పి పుట్టేశాయి. కండ్లు కూడా ఆర్పకుండా సాయిపల్లవి డ్యాన్స్ ను చూస్తూ ఉండిపోయా. లవ్ స్టోరీ టీం మొత్తానికి కంగ్రాట్స్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సుమ. మొత్తానికి లవ్ స్టోరీ కలెక్షన్లు సైతం జోరుగా ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ తరువాత ఓవర్సీస్‌లో లవ్ స్టోరీ క్రియేట్ చేస్తోన్న రికార్డులకు అందరూ ఆశ్చర్యపోతోన్నారు.