ఇండియాను కలవరపెడుతోన్న కరోనా : కొత్తగా 26,727 కేసులు

ఇండియా లో కరోనా మహమ్మారి కేసులు మళ్ళీ విజృంభిస్తున్నాయి. ఇవాళ కరోనా కేసులు మరోసారి పెరిగాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 26,727 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,37,66,707 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,75,224 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.09 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 277 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,48,339 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 28,246 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,30,43,144 కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 64,40,451 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 89,02,08,007 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.