Vidyullekha: విద్యుల్లేఖా రామన్.. తన సూపర్ కామెడీ టైమింగ్‌తో తెలుగు, తమిళ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చెన్నై బొద్దు బొమ్మ తన సూపర్ కామెడీతో వెండి తెరపై నవ్వుల పువ్వులు పూయిస్తుంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ లేడీ కమెడియన్.. కొద్ది రోజుల క్రితం ఫిజిక్ మీద సీరియస్‌గా ఫోకస్ పెట్టి స్లిమ్ అయిపోయింది.ఈ సమయంలోనే కీటో డైట్ ఎక్స్పర్ట్ అయిన సంజయ్ ప్రేమలో పడింది. పెద్దలను ఒప్పించి.. గతేడాది ఆగస్టులోనే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. సెప్టెంబర్ 9న వైవాహిక బంధంతో ఒక్కటైంది.
అయితే పెళ్లి తర్వాత హనీమూన్‌కి వెళ్లిన ఈ జంట సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు పెడుతూ నెటిజన్స్‌కి వినోదాన్ని అందిస్తుంది. అయితే రీసెంట్గా స్విమ్ సూట్ డ్రెస్‌లో దిగిన పిక్ షేర్ చేయగా నెటిజన్లను షేక్ చేసింది. అంతేకాకుండా.. విడాకులు ఎప్పుడు?’ అని కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లు చూసిన విద్యుల్లేఖా ఫైర్ అయ్యింది.
1920ల నాటి కాలాన్ని వదిలి 2021కు రండి. సమస్య నెగెటివ్ కామెంట్స్ వల్ల కాదు. సమాజం ఆలోచించే తీరును బట్టి ఉంటుంది. ఒక మహిళ వస్త్రధారణే విడాకులకు కారణమైతే సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలందరూ సంతోషకమైన వైవాహిక జీవితాల్లో ఉన్నారా? అని ప్రశ్నించింది.
జీవితానికి భద్రత, భరోసానిచ్చే, నీతి, నిజాయతీ, విశ్వాసాలు కలిగించే సంజయ్ లాంటి భర్త లభించడం నా అదృష్టం. విమర్శల్ని వదిలేయండి. సంకుచిత వ్యక్తిత్వం ఉన్న మనుషులని నేను మార్చలేను. మీ జీవితంలో మహిళ అంటే కామవాంఛ తీర్చే సాధనంగా, అణిగి మణిగి, ఎలాంటి అవమానాన్నైనా భరిస్తూ ఉండే వ్యక్తిగా చూస్తున్నప్పుడు ఆమెలోని వ్యక్తిత్వం మీకెక్కడ కనిపిస్తుంది. బతుకు.. బతకనివ్వు’’అంటూ కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చింది విద్యుల్లేఖా.
విద్యుల్లేఖ తెలుగులో ‘ధ్రువ’, ‘సరైనోడు’, ‘రాజా ది గ్రేట్’, ‘రాజు గారి గది2’, ‘తొలిప్రేమ’, ‘మహర్షి’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.