MAA ELECTIONS : మా ఎన్నికల పోలింగ్‌ పై రోజా సంచలన వ్యాఖ్యలు

-

మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికల నేపథ్యం లో పోలింగ్‌ కేంద్రంలో చోటు చేసుకున్న వివాదం పై నగరి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలను తలపిస్తున్నాయని… గతంలో ఎన్నడూ ఇలా ప్రచారం, హడావుడి జరగ లేదని పేర్కొన్నారు ఎమ్మెల్యే రోజా. నేను లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ ను తాను అస్సలు నమ్మబోనన్ని చెప్పారు రోజా.

ఆ విషయానికి వస్తే హీరోయిన్లు అందరూ నాన్ లోకాలేనని స్పష్టం చేశారు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ఆలింగనం చేసుకోవడం మంచిదేనని వెల్లడించారు. ఎవరు గెలిచినా మా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని… రెండు ప్రభుత్వాలు సినిమా కార్మికులకు అండగా ఉండాలని పేర్కొన్నారు ఎమ్మెల్యే రోజా.

కాగా… మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికల తీవ్ర గందర గోళంగా మారింది. ప్రకాశ్‌ రాజ్‌ మరియు మంచు విష్ణు వివాదం చెలరేగింది. ప్రకాశ్‌ రాజ్‌ కు సంబంధించిన ప్యానెల్‌ సభ్యులు.. పోలింగ్‌ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు మంచు విష్ణు ప్యానెల్‌ సభ్యులు. దీంతో అర్ధాంతరంగా మా అసోషియేషన్‌ ఎన్నికలను ఆపేశారు ఎన్నికల అధికారి.

Read more RELATED
Recommended to you

Latest news