MAA Elections: గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. జనరల్ ఎలక్షన్లకు ఏ మాత్రం తీసిపోకుండా.. చాలా ఉత్కంఠగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి ప్రచారం జోరుగా సాగింది. పోటీలోని నిలిచిన ఏ అభ్యర్థి కూడా అసలు తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించారు. నువ్వా.. నేనా అంటూ సాగుతున్న ఈ పోరులో సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు.. విమర్శలు ఇలా రచ్చ రచ్చ చేశారు.
పోటీలోని నిలిచిన అభ్యర్థులే కాదు.. వారికి మద్దతుగా నిలిచిన వారు కూడా కూడా ప్రచార ఘట్టాన్ని మాటల తూటాలతో ప్రచారాన్ని రక్తికట్టించారు. ప్రచార పర్వం ముగియడంలో సీన్ మొత్తం మారింది. ఇది నిన్నటి వరకు ఉన్న పరిస్థితికి.. నేడు ఉన్న పరిస్థితి చాలా వేరుగా ఉంది.చాలా మంది .. ఓటు వేసేందుకు దూరంగా ఉంటారని భావించినా.. ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వచ్చారు.
మా ఎన్నికల పోలింగ్ ఈ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ప్రారంభమైంది. ఈ తరుణంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ కేంద్రం వద్ద.. మోహన్ బాబు, మంచు విష్ణు, ప్రకాష్ రాజ్‌లు ఒక్కరికి ఒక్కరూ తారసపడ్డారు.
ఏదో యుద్దమే జరిగేట్లు ఉందని చూసేవాళ్లు అనుకున్నా.. ఎవ్వరూ ఊహించని విధంగా ప్రకాష్ రాజ్ మంచు విష్ణులు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకున్నారు. మోహన్ బాబు సమక్షంలో ఇద్దరూ చేతులు కలుపుకున్నారు. అనంతరం ప్రకాష్ రాజ్.. మోహన్ బాబుకు పాదాభివందనం చేయడానికి ప్రయత్నించడంతో అది చిత్రం చూసిన వాళ్లు అందరూ షాక్ అయ్యారు.
ప్రకాష్ రాజ్ ను వారించిన మోహన్ బాబు భుజం తట్టి ఆశీర్వదించారు.మా మాజీ అధ్యక్షుడు నరేశ్ సైతం అక్కడే పక్కనే ఉండడం మరో విశేషం. ఇలా పోలింగ్ వేళ.. మంచు విష్ణు ప్రకాష్ రాజ్ లు ఒక్కటయ్యారు. శృతిమించినా మాటాలకు ఒకే ఒక్క హగ్ తో అన్నింటికి పుల్ స్టాప్ పెట్టేశారు. నిజంగానే మా నటులు .. “మహా “నటులు అనిపించుకున్నారు.
ఎలక్షన్స్ లో సినీ ప్రముఖుల హడావుడి మాములుగా లేదు.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి అగ్రహీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పోలింగ్ మధ్యాహ్నం 2 గంట్ల వరకు సాగనుంది. ఇప్పటి వరకూ కేవలం 30 శాతం జరగడం మరోషాకింగ్. సాయంత్రం 4 గంటల తరువాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటలకు వరకూ తుది ఫలితాలు వెలువడనున్నాయి.