పవన్ కళ్యాణ్ ది సిగ్గులేని తనం… పాతాళంలో పెడతారు : కొడాలి నాని

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు ఏపీ మంత్రి కొడాలి నాని. జగన్ పంజా దెబ్బలు చంద్రబాబు జీవితాంతం తింటాడని… పవన్ కళ్యాణ్ కమ్మలకు అండగా ఉంటానని అనటం సిగ్గు లేనితనమని మండిపడ్డారు. రాధాకృష్ణ, రామోజీరావు, నాయుడు చంద్రబాబుకు అండగా ఉంటానని పవన్‌ అంటున్నాడని.. కమ్మ కులం అంటే ఈ నలుగురే అని పవన్ కళ్యాణ్ అనడం దారుణమన్నారు.

ఏ రాజకీయ నాయకుడు అయినా పేదలు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామంటారని.. ఇంత హీనంగా మాట్లాడే పవన్ కళ్యాణ్ , జనసేనను ప్రజలు పాతాళంలో పాతిపెడతారని హెచ్చరించారు కొడాలి నాని.  ఏ కమ్మ వ్యక్తి పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని అడిగాడో చెప్పాలని… జగన్మోహన్ రెడ్డి వంటి ఒకరైనా మా కులంలో పుడితే బాగుండేది కమ్మవాళ్ళు అనుకుంటున్నారని పేర్కొన్నారు.

యుద్ధం చేయగలిగే మగాడు అని జగన్ ను నమ్మారు కనుకే ప్రజలు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. బద్వేల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయే వ్యక్తులను ఎవరు నమ్ముతారని… ఎప్పుడు ఎవరిని ముంచుతారో తెలియని వాళ్ళకు విశ్వసనీయత ఉండదని పవన్‌ కు చురకలు అంటించారు. డ్వాక్రా సంఘాలను డిఫాల్టర్ సంఘాలుగా మార్చింది చంద్రబాబు అని.. పేద మహిళల నుంచి డబ్బులు దండుకున్న లుచ్చాఅని ఫైర్‌ అయ్యారు కొడాలి నాని.