పోలీసులను ఆశ్రయించిన పవన్ కళ్యాణ్ హీరోయిన్ !

-

ఒకప్పటి టాలీవుడ్‌ హీరోయిన్‌… మీరా చోప్రా గురించి తెలియని వారుండరు. పవన్‌ కళ్యాణ్‌ హీరో గా 2006 సంవత్సరం లో వచ్చిన బంగారం సినిమా లో నటించి… తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మీరా చోప్రా. బంగారం సినిమా తర్వాత… వాన, మారో మరియు గ్రీకు వీరుడు లాంటి సినిమా ల్లో నటించింది మీరా చోప్రా. అయితే.. తెలుగు నటించిన ఏ సినిమా స్టార్‌ డం రాకపోవడంతో బాలీవుడ్‌ లోనే సెటిల్‌ అయింది ఈ భామ.

ఇది ఇలా ఉండగా… మీరా చోప్రా.. తాజాగా ఇంటీరియర్‌ డిజైనర్‌ రాజేందర్‌ దివాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ముంబైలో ఇల్లు కొనుగోలు చేసింది. ఆ ఇంటిని అలంకరించేందుకు రాజేందర్‌ తో రూ. 17 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే రూ. 8 లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చింది. షూట్‌ కోసం 200 రోజులు బయటికి వెళ్లి వచ్చేసరికి నాణ్యత లేని మెటీరియల్‌ తో ఇల్లు డిజైన్‌ చేశాడని గ్రహించి.. నిలదీయగా.. తన ఇంట్లో నుంచి తననే బయటికి గెంటేశాడని ఫిర్యాదులో పేర్కొంది మీరా చొప్రా.

Read more RELATED
Recommended to you

Latest news