NTR – EMK: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కు బ్రేక్! యంగ్ టైగర్ రెమ్యూనరేషన్ ఎంత‌?

-

NTR – EMK: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. వెండితెర మీద‌నే కాదు.. బుల్లితెర‌పై కూడా త‌న స‌త్తా చాటుతున్నారు. న‌టుడుగానే కాకుండా వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించి మెప్పించారు. ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ అదరగొడుతున్నారు. ఈ షోలో సినీ సెల‌బ్రెటీల‌తో పాటు సామాన్యులను ర‌ప్పించి.. సక్సెస్ పుల్ చేశారు. తాజా స‌మాచారం ప్రకారం ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ సీజ‌న్ 1కు సంబంధించిన షూటింగ్ పూర్తి అయినట్టు టాక్ వినిపిస్తోంది.

తొలుత ఈ షోను త‌న స్నేహితుడు, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. త‌ర్వాత రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, స‌మంత వంటి స్టార్ల‌ను ఇన్వైగ్ చేసి.. పుల్ ఎంట‌ర్ టైన్ చేశారు. తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నాల‌ను ఈ షోకు పిలిచిన‌ట్టు తెలుస్తుంది. వీరికి సంబంధించిన ప్రోమోలు విడుద‌ల‌య్యాయి. అయితే అన్నీ ఎపిసోడ్స్‌ను ఎన్టీఆర్ పూర్తి చేశాడ‌ట.

సీజన్లో 60 ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు నిర్వాహకులు. తాజాగా ఆ 60 ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది. ఇంతటితో సీజన్ కంప్లీట్ చేస్తారని సమాచారం. దాదాపు మొత్తం 60 ఎపిసోడ్స్‌ కోసం ఎన్టీఆర్ రూ.7.5 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడని టాక్. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఎన్టీఆర్ ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. త్వ‌ర‌లోనే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే సినిమా కోసం ఎన్టీఆర్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news