తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో సమయ పాలన పాటించడం లేదని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభను కించపరిచేందుకు ప్రతీరోజు ఏదో ఒక అంశాన్ని తెర మీదికి తీసుకొని రావడం బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. ఎప్పుడూ మొదలు పెట్టామని కాదు.. ప్రజా సమస్యలపై ఎంత సేపు చర్చించామన్నదే ముఖ్యం అని చెప్పారు.
అతి ముఖ్యమైన బిల్లులలో ఏ రోజులో చర్చకు రానివ్వడం లేదని.. చివరికీ వారు పెట్టిన ప్రివెలేజ్ మోషన్ బిల్లు పై కూడా చర్చ జరగనివ్వలేదని అన్నారు. అంతేకాదు.. భూ భారతి బిల్లు పై ప్రిపేర్ అయి వస్తామని కోరితే సమయం ఇచ్చారని దానిని కూడా ఉపయోగించకుండా చర్చ జరగనివ్వలేదని మండిపడ్డారు. సమయ పాలన గురించి మాట్లాడే వీళ్లు ప్రతిపక్ష నాయకుడు ఇంత వరకు సభకే రాలేదని.. సభా ప్రతిష్టను దిగజారుస్తున్న దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.