Surya’s Jai Bheem : సూర్య ‘జై భీమ్’ నుంచి ‘ప‌వ‌ర్’ సాంగ్ రిలీజ్.. నెట్టింట్లో హ‌ల్ చ‌ల్!

-

Surya’s Jai Bheem: త‌మిళ స్టార్ హీరో సూర్య.. ఆయ‌న గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వైవిధ్య‌మైన కథలను ఎంచుకుంటూ.. ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. అటు త‌మిళ్ లోనూ.. ఇటు తెలుగులోనూ క్రేజీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక గతేడాది ఆకాశం నీ హద్దురా సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు సూర్య. ఇది డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయింది.

తాజాగా ఓ రియల్ స్టోరీతో తెర‌కెక్కుతున్న చిత్రం జై భీమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ చేయ‌బోతున్నారు మూవీ మేక‌ర్స్. నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమాకు జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు.

గిరిజ‌నుల‌కు న్యాయం జరిగేలా పోరాడే లాయ‌ర్ చందులాల్ పాత్ర‌లో సూర్య క‌నిపించ‌నున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఫస్ట్ లుక్, ట్రైలర్ లు చాలా ఆక‌ట్టుకుంటున్నాయి. ఇవి సినిమాపై మ‌రింత ఆసక్తిని పెంచేశాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్ర యూనిట్ .. ఈ సినిమా నుంచి పాటను విడుదల చేశారు. ‘పవర్’ అంటూ సాగే ఓ పాటను విడుద‌ల చేశారు.http://<iframe width=”640″ height=”360″ src=”https://www.youtube.com/embed/3xt20VweL5c” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>

ఈ పాటకు ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సీన్ రోల్డన్ కంపోజ్ చేసిన ఈ పాటకి అరివు సాహిత్యాన్ని అందించడమే కాకుండా తానే ఆలపించాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news