ఉత్తరప్రదేశ్ లోని లిఖింపూర్ ఖేరీలో రైతుల నిరసన లో హింస చోటు చేసుకున్న సంగతి తెలింసిందే. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది మృతి చెందగా వారిలో నలుగురు రైతులు ఉన్నారు. రైతుల మీదకు ఎస్ యూవీ వాహనంతో కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా దూసుకుపోవడంతో ఈ హింస చోటు చేసుకున్నట్టు గుర్తించగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రాతో పాటు పదమూడు మంది నింధితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అంతే కాకుండా ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతోంది. అయితే ప్రస్తుతం ఆశిష్ మిశ్రా డెంగ్యూతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. దాంతో అతడిని వైద్యం కోసం జిల్లా జైలు నుండి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆశిష్ కు వైద్య పరీక్షలు నిర్వహించామని అతడి రక్తనమూనా రిపోర్ట్ కోసం ఎదరుచూస్తున్నామని వైద్యులు చెబుతున్నారు.