బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని చెప్పినవాడ్ని చెప్పుతో కొట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ఆర్ఎస్ బ్రదర్స్‌లా కలిసి పని చేస్తున్నాయని సెటైర్లు పేల్చారు కేటీఆర్. ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.
తెలంగాణ రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే గతంలో మానవ హక్కుల గురించి మాట్లాడిన కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదని ఆగ్రహించారు. లగచర్ల లో జరిగిన ఘటనలో పూర్తిగా ఇంటలిజెన్స్, పోలీసుల వైఫల్యం ఉందని తెలిపారు. నా మీద కేసు పెడితే నేను ఊరుకుంటా అనుకుంటే రేవంత్ రెడ్డి అంతే పిచ్చోడు మరొకరు ఉండరని పేర్కొన్నారు.
జైలు నుంచి వచ్చాక కూడా పోరాటం చేస్తానని ప్రకటించారు. నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు, అవినీతి అంతకన్నా చేయలేదని వెల్లడించారు. మోడీనే మోడీయా బోడీయా ఏం పీక్కుంటారో పీక్కో అన్నాను….చిట్టి నాయుడికి కూడా అదే చెబుతున్నా…ఏం పీక్కుంటావో పీక్కో అంటూ చురకలు అంటించారు.