Esha Gupta: నటనపై ఆసక్తితో మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హాట్ బ్యూటీ ఈషా గుప్తా. తొలుత ‘జన్నత్’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. అందం, అభినయంతో వరుసగా పలు చిత్రాల్లో నటించి మెప్పిస్తుంది. ఇలా బాలీవుడ్లో హీరోయిన్ గా, లేడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన అందాల ఈ ముద్దుగుమ్మ. ఇదే సమయంలో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసి అలరించింది.
కేవలం హిందీలో కాదు తెలుగులో కూడా నటించింది. ‘ఏక్ బార్…ఏక్ బార్’ అంటూ ‘వినయ విధేయ రామ’ సినిమాలో రామ్‌చరణ్‌తో స్టెప్పులేసిన ఈ భామ తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. వీలున్నప్పుడల్లా హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది. కుర్రకారు మతులు పొగొట్టే పొగొట్టే ప్రయత్నం చేస్తుంది.
తన కేరీర్ ప్రారంభంలో తాను కూడా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కోన్నానని, తనకు జరిగిన ఘటన మరెవరికి జరగకుడదని భాధపడ్డారు ఈషా గుప్తా. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ భయానక కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ. సంచలన వాస్తవాలను బయట పెట్టారు.
అలాగే.. తొలి సారి సెట్స్ లో డైరెక్టర్.. హిందీలో ఏదో ఆసభ్యకరంగా మాట్లాడారు కానీ, అది అర్థం కాలేదు. నా వైపు డిఫరెంట్ చూసారు. ఎందుకు లేటుగా వచ్చావ్ అని డైరెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు డైరెక్టర్ కోపానికి తాను లేటుగా రావడం కాదని తెలుసు.. కాస్ట్యూమ్ గురించి. నిజానికి ఆ రోజు సెటుకు అందరి కంటే తానే వెళ్లానని చెప్పింది. నా కాస్ట్యూమ్ గురించే. ఆ విషయంలో కూడా నా తప్పులేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండో సారి.. అత్యంత దారుణమైన తిట్టాడు. ఫస్ట్ సారి తిట్టినప్పుడు వదిలేశా.. రెండోసారి నా వల్ల కాలేదు. తిరిగి నేను కూడా తిట్టేశాను. అలాగే సెట్స్ నుండి వెళ్లి వచ్చాను. తరువాత ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేసి సారీ చెప్పారు. కానీ నేను వినలేదు.. డైరెక్టర్ సారీ చెబితేనే.. షూటింగ్ కి వస్తానని తెగెసే చెప్పాను. దీంతో రెండు రోజుల తరువాత ఆ డైరెక్టర్ నాకు సారీ చెప్పారు… అంటూ తనకు ఎదురైన చేదు అనుభవం పంచుకుంది.