Puneeth Rajkumar Biography: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో శాండీల్ వుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. తమ సూపర్ స్టార్ పునీత్ హఠాన్మరణం సినీ అభిమానులను షాక్ కు గురిచేసింది. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ మూడో కుమారుడిగా పునీత్ రాజ్ కుమార్ 19975 మార్చ్ 17న జన్మించాడు. పునీత్ అసలు పేరు లోహిత్ రాజ్ కుమార్. సినిమాల్లోకి వచ్చాక పునీత్ గా పేరు మార్చుకున్నారు.
కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ నటవారసుడిగా 1985లో ‘బెట్టాడు హూవి’చిత్రంతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి, ఉత్తమ బాలనటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. బాలనటుడిగా దాదాపు 14 సినిమాల్లో నటించారు. పునీత్ పుడుతూనే స్టార్. ఎదుగుతున్న క్రమంలో తండ్రి రాజ్ కుమార్ కి నిజమైన వారసుడిగా కన్నడనాట గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కన్నడ పవర్ స్టార్ గా మారడానికి పునీత్ చాలా కష్టపడ్డాడు. అతని జీవితం క్రమశిక్షణతో సాగింది.
పునీత్ రాజ్ కుమార్ 2002లో హీరోగా అప్పు అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రం కన్నడలో ఓ ఊపు ఊపేసింది. అలా మొదటి సినిమాతోనే పునీత్ సూపర్ స్టార్ గా మారాడు. అనంతరం.. అభి (2003), వీర కన్నడిగ (2004), మౌర్య (2004), ఆకాష్ (2005), అజయ్ (2006), అరసు (2007), మిలానా (2007), వంశీ (2008) వంటి భారీ హీట్ లను సొంతం చేసుకుని వెండితెర మీద తిరుగులేని స్టార్ నిలిచారు.
పునీత్ కెరీర్ లో ఎక్కువగా మాస్ సినిమాలే చేశారు. ఈ క్రమంలో అవార్డ్స్ అతన్నివెతుక్కుంటూ వచ్చాయి. కన్నడ నాట అత్యథిక కలెక్షన్లు సాధించిన హీరోగా, అత్యథిక పారితోషికం అందుకున్న హీరోగానూ రికార్డ్ సృష్టించారు. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో 29 సినిమాలు చేశారు పునీత్ రాజ్‌కుమార్. చివరగా యువరత్న సినిమాలో నటించారు. కన్నడ చిత్ర సీమలో ఏ హీరోకి లేని ఘనత కూడా పునీత్ రాజ్ కుమార్ కే దక్కింది. ఆయన చిత్రాలన్ని కన్నడలో సూపర్ హిట్లుగా నిలిచిపోయాయి.
పునీత్ రాజ్ కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం నటుడుగానే ఆగలేదు. ఆయనకు పాటలు పాడటం కూడా చాలా ఇష్టం. ఆయన ఆరేళ్ళ వయసు నుండే సినిమాల్లో పాటలు పాడటం ప్రారంభించాడు. ఆయన తొలిసారిగా 1981లో భాగ్యవంత చిత్రంలో రెండు పాటలు పాడాడు. ఆయన సినిమా హీరో అయ్యాక కూడా సంగీతాన్ని విడిచిపెట్టలేదు. ఆయనకు ఇతర హీరోల సినిమాల్లో కూడా పాటలు పాడాడు. నటుడుగానే కాకుండా గాయకుడిగా పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.
పునీత్ రాజ్ కుమార్ హీరోనే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలకు వ్యవహరించాడు. తొలిసారి 2019లో కవలుదారీ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి.. సక్సెస్ అయ్యాడు. అనంతరం పలు సక్సెస్ పుల్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. పునీత్ బిగ్ స్క్రీన్ మీద బిబీబిజీగా ఉంటూనే స్మాల్ స్క్రీన్ లో కూడా కనిపించాడు. పలు షో లకు హోస్ట్ గా వ్యవహరించారు. కన్నడంలో ప్రసారమైనా..కన్నడద కొట్యాధిపతి( మీలో ఎవరూ కోటిశ్వరులు) షో కు రెండు సీజన్స్ ల్లో హోస్ట్ గా వ్యవహరించి.. విజయవంతంగా నడిపించాడు. అలాగే యూపీ స్టార్టర్స్ కు జడ్జిగా వ్యవహరించాడు.
సినిమాలు, టీవీ షోలే కాదు..పలు సామాజిక కార్యక్రమాల్లో తన దాతృత్వన్ని చాటుకున్నారు. తన తల్లి పార్వతమ్మతో కలిసి అనేక సామాజిక, సేవా కార్యక్రమాలలో పాల్గొనేవాడు. పలు బ్రాండులకు ప్రచార కర్తగా కూడా వ్యవహరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు టీమ్ కు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడు.
1999న డిసెంబర్ ఒకటిన అశ్విని రేవంత్ ను పునీత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ప్రశంసలందుకు ఈ జంటకు దృతి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం అశ్విని రేవంత్ శాండిల్‌వుడ్‌లో ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు. అనేక సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పని చేశారు. 2019లో పునీత్ ప్రొడ్యూస్ చేసిన కవల్‌దారి మూవీని ప్రెజంటర్‌గా వ్యవహరించారు. అలాగే వీరిద్దరూ పీఆర్‌కే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సినిమాలను నిర్మించారు. ఇలా 20 ఏళ్ల కాపురాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో, పునీత్ అర్థాంతరంగా ఈ లోకాన్ని వీడటం విషాదం. పునీత్ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిద్దాం.