ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ అయింది. దాంతో హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికల పోలింగ్ ను రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఉప ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అంతేకాకుండా హుజురాబాద్ ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా ప్రచారం జరుగుతోంది.
ఓటుకు వేలాది రూపాయలు పార్టీలు ఖర్చు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక్కో ఓటుకు ఆరు వేల నుండి పది వేల చొప్పున ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఆరు నెలలుగా ఈ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు హోరాహోరి ప్రచారాలు నిర్వహించాయి. ఈటల రాజేందర్ రాజీనామాతోనే ఈ ఉప ఎన్నికలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే హుజరాబాద్ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కుటుంబ సమేతంగా వచ్చి కమలాపూర్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.