Anjali: టాలీవుడ్ లో ఎక్కువ తమిళ సినిమాలను రీమేక్ చేయడానికి ఆసక్తి చూపేవారు. కానీ, ఆ ట్రెండ్ మారింది. కథ బాగుంటే చాలు.. భాష బేధాలు లేకుండా తెలుగు లో తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా మలయాళ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఇటీవల మలయాళంలో హిట్ అయినా.. చిత్రం నయాట్టు. సామాజిక ఆంశంపై తెరకెక్కిన మూవీకి మార్టిన్ ప్రకట్ దర్శకత్వం వహించారు.
ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి ముందుకు వచ్చింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన నిర్మాణ సంస్థ జీఏ2పిక్చర్స్ బ్యానర్. ఈ చిత్రాన్ని పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ వంటి హిట్ సినిమాలను అందించిన కరణ్ కుమార్ ఈ సినిమాను వెండి తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి, ప్రముఖ నటలు రావు రమేశ్, నటుడు ప్రియదర్శీ పోలీసు పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. నేడు ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది, అల్లు అన్విత క్లాప్ ఇచ్చి ఈ సినిమాను ప్రారంభించారు, అల్లు అరవింద్ గారు కెమెరా స్విచ్ఛ్ ఆన్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఇతర వివరాలను త్వరలోనే త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.