ఫాంహౌజ్ పేకాట కేసులో 30 మందికి రిమాండ్..

-

మంచిరేవుల ఫాం హౌజ్ కేసులో పట్టుబడ్డ నిందితులు 30 మందికి ఉప్పరపల్లి కోర్ట్ 14 రోజుల పాటు ఈనెల 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిందితుల తరుపున బెయిల్ పిటీషన్ వేసిన కోర్ట్ దీన్ని కొట్టేసింది. దీంతో నిందితుకు రిమాండ్ తప్పలేదు. ప్రధాన నిందితుడు గుత్తా సుమన్ కుమార్ ను కస్టడీకి రేపు పోలీసులు కోరే అవకాశం ఉంది. నిన్న మంచిరేవులలో సినీ నటుడు నాగశౌర్య కుటుంబానికి చెందిన ఫాం హౌజ్ కావడంతో ఘటన సంచలనం కలిగించింది. ప్రధాన నిందితుడు ఫోన్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల ఫోన్ కాంటాక్ట్ ఉండటంతో ఈ కేసు పోలీసులకు ప్రధానంగా మారింది. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే కూడా పట్టుబడటంతో సంచలనం కలిగించింది.

నిన్న పోలీసులు దాడుల్లో పేకాట అడుతు పలువురు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.6.7 లక్షల నగదు, 33 సెల్ ఫోన్లు, 24 కార్లు, 2 క్యాసినో డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరు నెలల క్రితం నాగశౌర్య కుటుంబానికి చెందిన ఫామ్ హౌజ్ ను నిందితుడు 6 నెలల క్రితం లీజుకు తీసుకున్నట్లు చెబుతున్నాడు. అయితే విచారణలో మరిన్ని విషయాలు తెలియాలి. నిందితుడికి నేర చరిత్ర కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news