కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొడాలి నాని పవన్ కళ్యాణ్ విశాఖ సభలో చేసిన కామెంట్స్ పై స్పందించారు. పవన్ కళ్యాణ్ ను ఉద్యమం చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నామని కొడాలి నాని అన్నారు. పవన్ కళ్యాణ్ కు జ్ఞానోదయం కలిగి విశాఖ ఉక్కు పరిరక్షణకు ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో డెడ్ పార్టీ అయిన జనసేన మాకు డెడ్లైన్ పెడితే ఏమీ కాదు అంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కేంద్రం వద్దకు వెళ్లి మోడీకి డెడ్లైన్ పెడితే ఆయన ఏమైనా భయపడతాడు ఏమో కానీ రాష్ట్రంలో చచ్చిపోయిన పార్టీలు తెలుగుదేశం, జనసేన డెడ్ లైన్ లు పెడితే తాము భయపడము అంటూ కొడాలి హాట్ కామెంట్స్ చేసారు.