టపాసులు కాల్చడం పై జగ్గీ వసుదేవ్ వ్యాఖ్యలకు సమంత సపోర్ట్..!

-

టపాసులు కాల్చడం ద్వారా వచ్చే పొగతో పర్యావరణానికి నష్టం జరుగుతుంది అన్న సంగతి తెలిసిందే. అయితే దీపావళి వచ్చినప్పుడే చాలామందికి పర్యావరణ పరిరక్షణ గుర్తొస్తుంది. ప్రతిరోజు సిగరెట్లు తాగే వాళ్ళు కూడా దీపావళి వచ్చినప్పుడు పర్యావరణం గురించి ఆలోచిస్తారు. టపాసులు కాల్చవద్దంటూ నీతి బోధ చేస్తూ ఉంటారు. అయితే అలాంటి వారికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ షాక్ ఇచ్చారు. దీపావళి ఆనందానికి కాలుష్యం ప్రతిబంధకంగా మారకూడదని అన్నారు. పిల్లలతో సహా ఎవరూ టపాసులు కాల్చేవద్దు అనేది సరికాదని పేర్కొన్నారు.

దీనికి ఒక పరిష్కారం ఉందని పెద్దవాళ్ళు తప్ప అసలు టపాసులు కాల్చకుండా పిల్లలతో మాత్రం కాల్పించాలి అని అన్నారు. దాంతో వారు మానసిక ఆనందాన్ని పొందుతారని చెప్పారు. అంతేకాకుండా పెద్దవాళ్లు ఒక రెండు రోజులు ఆఫీసుకు వాహనాల్లో కాకుండా నడుచుకుంటూ వెళ్లాలని అని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సమంత షేర్ చేస్తూ సపోర్ట్ చేసింది. అంతేకాకుండా టపాసులను నిషేదించవద్దు అంటూ సమంత పేర్కొంది. ఇదిలా ఉండగా సమంత ప్రతి శివరాత్రికి జగ్గీ వసుదేవ్ ఆశ్రమానికి వెళ్లి ప్రార్థనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news