కొత్త సంవత్సరం రాబోతుంది. మరో మూడు రోజుల్లోనే న్యూ ఇయర్ లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో మందు బాబులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మందు బాంబులకు శుభవార్త చెప్పడం జరిగింది. ఈనెల 31వ తేదీన వైన్స్ అర్ధరాత్రి 12 గంటల వరకు ఓపెన్ చేసుకోవచ్చని… ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
వైన్ షాపు లే కాకుండా…. బార్లు రెస్టారెంట్లు ఈవెంట్ల పర్మిషన్లకు ఒంటిగంట వరకు.. ఆశిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ కావడం జరిగింది. అయితే ఈ వేడుకలలో డ్రగ్స్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న.. ఈవెంట్స్ అలాగే పార్టీలపై నిగా పెట్టాలని కూడా సూచనలు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇక ఈ ప్రకటనతో మందు బాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.