విశాఖ కార్పొరేషన్ లో ఉప ఎన్నిక.. టీడీపీకి వైసీపీ మద్దతు !

విశాఖపట్నం లోని జీవీఎంసీ 31 వ వార్డు కార్పొరేటర్ పదవి ఉప ఎన్నిక లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీవీఎంసీ 31 వ వార్డు కార్పొరేటర్ పదవి ఉప ఎన్నిక లో పోటీ చేయకూడదని అధికార వైసీపీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. టీడీపీ కార్పొరేటర్ పార్టీ వానపల్లి రవికుమార్ మరణం తో.. జీవీఎంసీ 31 వ వార్డు కార్పొరేటర్ పదవి ఉప ఎన్నిక జరుగుతోంది.

chandrababu naidu ys jagan

అయితే వానపల్లి రవి కుమార్ సతీమణి గాయత్రి ని టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తే పోటీ చేయకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. అనితర ప్రజా సేవ చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే పోటీ చేయకూడదన్న రాజకీయ విలువలకు వైసీపీ పార్టీ కట్టుబడి ఉందని విజయసాయిరెడ్డి కార్యాలయం పేర్కొంది. పద్మశాలి సామాజిక వర్గం విస్తృత ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల తో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి కూడా అధికారికంగా ప్రకటన చేశారు. అయితే టిడిపి పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందో చూడాల్సి ఉంది.