భారత వ్యాక్సిన్ల సర్టిఫికేట్లకు 96 దేశాల పరస్పర అంగీకారం..

-

ప్రపంచంలో భారత వ్యాక్సిన్లకు కీలక విజయాలు లభిస్తున్నాయి. భారత్ తయారీ వ్యాక్సిన్లు వేయించుకున్న వారికి ప్రపంచ దేశాలకు ఇక సులభంగా అనుమతి లభించనుంది. కోవిడ్ సర్టిఫికేట్ల పరస్పర అంగీకారానికి ఇప్పటి వరకు 96 దేశాలు అంగీకరించాయి. దీంతో భారత్ లో తయారైన కోవీషీల్డ్, కోవాగ్జిన్ వేసుకున్న ప్రజలు ఈ దేశాలకు ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రయాణించవచ్చు. కేవలం వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. కోవిన్ యాప్ ద్వారా సులభంగా సర్టిఫికేట్ ను తీసుకోవచ్చు.

ఇప్పటికే కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. అంతకుముందు ఆస్ట్రేలియా వంటిదేశాలు కూడా కోవాగ్జిన్ టీకాను ఆమోదించాయి. ప్రస్తుతం WHO కోవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతి ఇవ్వడంతో  ప్రపంచ దేశాలకు కోవాగ్జిన్ ఎగుమతి చేయవచ్చు. ఇదిలా ఉంటే కోవాగ్జిన్, కోవీషీల్డ్ తీసుకున్న విద్యార్ధులు, భారతీయ పౌరులు సులభంగా ప్రపంచదేశాలకు వెళ్లే అవకాశం ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news