కేసీఆర్‌ని బయటకులాగారా? బయటకొస్తున్నారా?

-

ఏమైందో ఏమో గానీ ఏదో అప్పుడప్పుడు మాత్రమే మీడియా సమావేశాలు పెట్టే…తెలంగాణ సీఎం కేసీఆర్, తాజాగా వరుసపెట్టి మీడియా సమావేశాలు పెడుతున్నారు. అలాగే ఇంకా వరుసగా మీడియా సమావేశాలు పెట్టేలా ఉన్నారు. ఇక మీడియా సమావేశాల్లో కేసీఆర్ టార్గెట్ ఒక్కటే…అది బీజేపీ మాత్రమే. బీజేపీ టార్గెట్‌గానే కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలోని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఇంతకాలం బండి తనపై చేసిన విమర్శలకు ఇప్పుడు ఓ రేంజ్‌లో కౌంటర్లు ఇస్తున్నారు.

kcr
kcr

అలాగే ధాన్యం కొనుగోలు, పెట్రోల్, డీజిల్‌లకు సంబంధించిన వ్యాట్ తగ్గింపులపై కూడా మాట్లాడుతున్నారు…ఇకపై కేంద్ర ప్రభుత్వంపై యుద్ధమే అంటున్నారు. అసలు గత రెండు రోజులుగా కేసీఆర్…బీజేపీ టార్గెట్‌గా ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలిసిందే. అసలు ఏదో పెద్ద అంశం ఉంటేనే తప్ప బయటకురాని కేసీఆర్…ఇప్పుడు మాటమాటకు ప్రెస్ మీట్ పెట్టేస్తున్నారు. బీజేపీ నేతలు విమర్శలు చేస్తే.. టీఆర్ఎస్ నుంచి ఎవరోకరు కౌంటర్లు ఇవ్వొచ్చు.

కానీ కేసీఆర్ ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. తానే స్వయంగా రంగంలోకి దిగేశారు. తానే మీడియా మీట్ పెట్టి మరీ బీజేపీపై ఫైర్ అవుతున్నారు. అంటే బీజేపీ నేతలు చేసే ప్రతి విమర్శకు కేసీఆరే కౌంటర్ ఇచ్చేలా ఉన్నారు. ఇంకా రోజూ ఇదే పనిలో ఉండేలా ఉన్నారు. అయితే సీఎం స్థాయి వచ్చి రోజూ మీడియా సమావేశం పెట్టి ప్రత్యర్ధులకు కౌంటర్లు ఇవ్వాల్సినంత అవసరం ఏం వచ్చింది? అసలు ఎందుకు కేసీఆర్ మీడియా ముందుకొచ్చి తన ఫ్రస్టేషన్ మొత్తం చూపిస్తున్నారు? కేసీఆర్ కావాలని బయటకొస్తున్నారా? లేక బీజేపీ నేతలే బయటకొచ్చేలా చేశారా? అంటే కేసీఆర్‌కు ఇలా బయటకొచ్చి కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు.

కానీ హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటమి ప్రభావం కేసీఆర్‌పై బాగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు కేసీఆర్‌ని టార్గెట్ చేశారు…హుజూరాబాద్ తర్వాత మరింత టార్గెట్ చేశారు…అందుకే ఆ ఫ్రస్టేషన్‌లో కేసీఆర్ మీడియా ముందుకొచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే బీజేపీ వాళ్లే కేసీఆర్‌ని బయటకు లాగినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news