ట్రంప్ హెయిర్ కట్ కావాలా? కిమ్ హెయిర్ కట్ కావాలా? అది కూడా ఉచితంగా…!

-

trump and kim hair cut for free

నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ తెలుసు కదా. ఆయన కాస్త డిఫరెంట్ లేండి. ఆయన మాత్రమేనా.. ఆయన హెయిర్ స్టయిల్ కూడా డిఫరెంటే. అవును.. చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన హెయిర్ స్టయిల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెయిర్ స్టయిల్ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది.

అయితే.. వీళ్లిద్దరి హెయిర్ కట్ ను ఉచితంగా చేస్తానంటున్నాడు ఓ వ్యక్తి. వియత్నాంకు చెందిన ఈ హెయిర్ స్టయిలిస్ట్ ఈ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. వీళ్లిద్దరి హెయిర్ కట్ ను అతడు ఉచితంగా చేస్తానని ప్రకటించడం వెనుక ఓ కారణమూ లేకపోలేదు. ఈ నెల 27, 28 తేదీల్లో వియత్నాంలో ట్రంప్, కిమ్ భేటీ ఉంది. అందుకే ఇలా ఉచితంగా వాళ్ల హెయిర్ కట్ ను ప్రకటించాడట. వాళ్ల సమావేశానికి తన మద్దతుగా ఇలా ప్రచారం నిర్వహిస్తున్నాడన్నమాట.

మనోడు ఏదో సరదాగా ఈ ఉచిత హెయిర్ కట్ ను ప్రారంభిస్తే.. కిమ్, ట్రంప్ హెయిర్ కట్ చేయించుకోవడానికి వియత్నాం ప్రజలు క్యూ కడుతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news