సౌత్ మొత్తం ఎన్.టి.ఆరే.. ఇది కదా యంగ్ టైగర్ అంటే..!

-

స్టార్ హీరోగా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న ఎన్.టి.ఆర్ సినిమాలతో పాటుగా వాణిజ్య ప్రకటనలలో కూడా సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే నవరత్న ఆయిల్, బోరో ప్లస్, సెలెక్ట్ మొబైల్స్ కు ప్రచారకర్తగా ఉంటున్న ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ఫ్లేవర్డ్ డ్రింక్ అప్పీ ఫిజ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడు. సౌత్ మొత్తం ఎన్.టి.ఆర్ ఈ ప్రొడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాడని తెలుస్తుంది.

అప్పీ ఫిజ్ ను నార్త్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రమోట్ చేస్తున్నాడు. అక్కడ సల్మాన్ ఇక్కడ ఎన్.టి.ఆర్ అప్పీ ప్రచారకర్తలుగా ఉంటున్నారు. దీనికోసం ఎన్.టి.ఆర్ కు భారీ మొత్తం ఇచ్చారని తెలుస్తుంది. సౌత్ అన్ని భాషల్లో ఎన్.టి.ఆర్ క్రేజ్ సంపాదించాడు అందుకే తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం అన్ని భాషల్లో ఎన్.టి.ఆర్ అప్పీ యాడ్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news