టీ ట్వంటి ప్రపంచ్ కప్ టోర్నమెంట్ ముగిసింది. ఆది వారం రాత్రి న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా జట్లు మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అలాగే టీ ట్వంటి వరల్డ్ కప్ ను ఎగరేసుకు వెళ్లింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణిత ఓవర్లలో 172 పరుగులను 4 వికెట్లు కొల్పోయి చేసింది. దీంతో 173 భారీ లక్ష్యంతో ఆస్ట్రేలియా జట్టు బరి లోకి దిగింది. అయితే ఓపెనర్ ఆరోన్ ఫించ్ సింగిల్ డిజిట్ స్కోర్ కే అవుట్ అయినా.. మరొ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 53 (38) తో పాటు మిచెల్ మార్ష్ 77 (50) తో అలవకగా విజయం సాధించింది.
అయితే చివర్లో వార్నర్ అవుట్ కావడం తో గ్లాన్ మాక్స్ వెల్ 28 (18) తో కలిసి మిచెల్ మార్స్ విజయాన్ని అందుకున్నారు. ఇంకా 7 బంతులు మిగిలి ఉండగానే 173 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకున్నారు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఒక్కరే రెండు వికెట్ల తీశాడు. ఈ మ్యాచ్ లో 77 పరుగులతో ఆస్ట్రేలియా జట్టు విజయానికి కారణం అయిన మిచెల్ మార్ష్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన డేవిడ్ వార్నర్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరిస్ అవార్డు దక్కింది.